కన్నడ నాట హంగ్‌..!

SMTV Desk 2018-04-14 11:58:06  Today-Karvy opinion poll, karnataka elections, bjp, congress

బెంగుళూరు, ఏప్రిల్ 14 : కర్ణాటకలో వచ్చే నెల జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ జేడీ(ఎస్) ప్రచారాలను ముమ్మరం చేశాయి. 224 స్థానాలకు గానూ జరిగే ఈ మహాసమరం కోసం ఈ రెండు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి. అయితే ఏ పార్టీ మెజారిటీలోకి వస్తుంది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో..? జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించానుందా..? తదితర ప్రశ్నలకు తాజాగా ఇండియాటుడే–కార్వీ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో కొంతవరకు సమాధానాలు లభించాయి. రాష్ట్రంలో హంగ్‌ రాబోతోందని, కాంగ్రెస్‌ (90–101 సీట్లలో గెలుపు) అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని, జేడీఎస్‌ (34–43 సీట్లు) కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించబోతోందని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, బీజేపీ (78–86 సీట్లు)కి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ, మెజారిటీకి మాత్రం దూరంగానే ఉంటుందని తేలింది.