నవ వధూవరులు ఆషాఢ మాసంలో ఎందుకు కలవరు!!

SMTV Desk 2017-07-03 19:25:27  ashadamasam, new, couples

హైదరాబాద్, జులై 03 : ఆషాఢం అనగానే మహిళలకు గుర్తుకు వచ్చేది డిస్కౌంట్స్‌ సేల్. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాలు జన జీవనానికి మూలం. నీరు లేనిదే పంటలు పండవు అలాంటి వర్షాలు ప్రారంభం అయ్యేది, వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యేది ఈ మాసంలోనే. మన భారతీయ నెలల పేర్లు చంద్రుని ప్రయాణాన్ని అనుసరించి మొదలయ్యాయి. చంద్రుడు పూర్వాషాడనక్షత్ర, ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరించడం వల్ల ఆషాడమాసం అని పేరు వచ్చింది. అలాగే ఈ నెలలో కొన్ని వస్తువులు దానం చేసి తర్పణాలు వదిలితే పుణ్యం వస్తుంది అంటారు. కొత్తగా పెళ్ళైన వధువరులను ఈ మాసంలో కలిసి ఉండకూడదు అంటారు. అందుకని కోడలిని పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢ మాసంలో గర్భం దాల్చిదే 9 నెలల(అప్పడికి వేసవి కాలం ) తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అప్పుడు వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో తల్లీబిడ్డలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కాపురానికి దూరంగా ఉంచుతారు.