వారసుడితో అల్ ఖైదాకు పునర్జీవం

SMTV Desk 2017-05-29 12:39:06  osamabin laden,hamju,

న్యూయార్క్, మే 28 : ప్రపంచాన్ని ముఖ్యంగా అమెరికాను, గడగడలాడించిన అల్ ఖైదా పునర్జీవం పోసుకుంటోంది. అమెరికా ఆపరేషన్ నెప్టూన్ స్పిర్ తో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడేన్ ను హతమార్చిన విషయం తెలిసిందే. 2011 లో పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో నేవిసిల్స్ నిర్వహించిన నెప్టూన్ స్పిర్ ఆపరేషన్ లో అత్యంత చాకచక్యంగా మట్టు బెట్టి ఆయన మృత దేహాన్నిసముద్రం మధ్య భాగంలో తిరిగి కన్పించని విధంగా విసిరేశారు. అయితే అప్పటి నుండి దాదాపుగా అల్ ఖైదా కార్యకలాపాలు కనుమరుగయ్యాయి. ఐఎస్ఐఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్నట్లు ప్రకటనలు వచ్చినా, అల్ ఖైదా కార్యకలాపాలు ఏవి తిరిగి కొనసాగలేదు. ఇటీవల కాలంలో ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హామ్జా వారసుడిగా తిరిగి కార్యకలాపాలను నిర్వహించేందుకు సిద్దమైనట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి. హమ్జా ఒసామాబిన్ లాడెన్ మూడవ భార్య ఖైమాకు 15 వ సంతానం. దాంతో పాటు ఇస్లాం మత ప్రవక్త కుటుంబానికి చెందినట్లుగా వెల్లడవుతోంది. అమెరికాపై విమానాలతో దాడి చేసిన అనంతరం ఒసామాబిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ తోరాబోరా గుహాలలో దాక్కున్నాడు. అదే సమయంలో భార్య పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ క్రమంలో హమ్జా ఇరాన్ కు తరలించబడ్డాడు. తనకు ముజాహిదిన్ గా పనిచేయాలనే కోరిక ఉందని తండ్రికి లేఖ కూడా రాసినట్లుగా నిఘాసంస్థలు వెల్లడిస్తున్నాయి. అల్ ఖైదా సభ్యులు సైతం ఆయనను వారసుడిగా పరిగణిస్తున్నారని.. మత ప్రవక్త కుటుంబానికి చెందిన దరిమిలా అన్ని వర్గాలు, ముఖ్యంగా యువతలో అల్ ఖైదాపై ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు.