ఐపీఎల్ ఎంతో ఇచ్చింది : మాస్టర్ బ్లాస్టర్

SMTV Desk 2018-04-13 17:39:57  sachin tendulkar, sachin about ipl, HT Mint Asia Summit, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 : ఐపీఎల్ మెగా టోర్నీ అన్ని దేశాల సరిహద్దులను చెరిపేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఆదరణగల లీగ్ గా అవతరించింది. దీని ద్వారా ఎంతో మంది యువ క్రీడాకారులు ప్రతిభా వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ విషయంపై ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) అనేది ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తోందని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నారు. ఈ లీగ్‌ కేవలం భారత్‌లో ఉన్న క‍్రికెటర్లకు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరికీ ఎంతో సాయపడిందన్నారు. ‘హెచ్‌టీ మింట్‌ ఆసియా సమిట్‌’లో పాల్గొన్న మాస్టర్ బ్లాస్టర్ పలు అంశాలపై మాట్లాడారు. " అంతర్జాతీయ క్రికెట్‌ మాదిరిగా ఐపీఎల్‌ కూడా ఎంతో కఠినమైనది, పోటీ తత్వంతో కూడుకున్నది. ఐపీఎల్‌ భారత ఆటగాళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్లర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐపీఎల్‌ ఆడిన అనుభవంతోనే ఇతర దేశాల ఆటగాళ్లు భారత పర్యటనకు వస్తున్నారు. ఐపీఎల్‌ భారత క్రికెట్‌కే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంతో ఇచ్చింది" అని సచిన్‌ వ్యాఖ్యానించాడు.