తమిళనాడులో థియేటర్ల మూసివేత

SMTV Desk 2017-07-03 18:47:09  thamilnadu, Theaters, hero vishal, gst, 1700 theaters

చెన్నై, జూలై 03 : చెన్నైలో సినిమా థియేటర్ లు బోసి పోయి కనిపిస్తున్నాయి. తమ అభిమాన నటుడి సినిమా చూసేందుకు ఫ్యాన్స్ నిన్న మొన్నటి దాక థియేటర్ కి వచ్చేవారు. కాని ఇవాళ షో రద్దు అన్న బోర్డులు వారికి థియేటర్ ల దగ్గర దర్శనమిస్తున్నాయి. తమిళనాడులో మొత్తం 1700 థియేటర్ లు మూత పడ్డాయి. జీఎస్టీ స్లాబ్ తగ్గించే వరకు ఉద్యమం కొనసాగుతుందని థియేటర్ యాజమాన్యం చెబుతుంది. జీఎస్టీ కి నిరసనగా తమిళనాట సినిమా థియేటర్ ల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. చెన్నైతో సహా ప్రధాన నగరాల్లో థియేటర్ లు మూత పడ్డాయి. దీంతో ప్రాంతీయ చిత్రాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని థియేటర్ ఓనర్స్ అండ్ డిస్ట్రిబ్యుటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. 28% స్లాబ్ తట్టుకోలేకపోతున్నట్టు ఆందోళన జరుగుతుంది. టికెట్ ధర పెంచినప్పటికి తమకి ఎటువంటి లాభం లేదంటున్న యాజమాన్యం. బంద్ కు తమిళ సినిమా నటులు కూడా సంపూర్ణ మద్దత్తు ప్రకటించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నటుడు విశాల్ డిమాండ్ చేసారు. ఇతర రాష్ట్రాలకి ఇస్తున్నట్టు సినిమా రంగానికి పన్ను రాయితీ ఇవ్వాలని నటుడు విశాల కోరుతున్నారు. ఇక పోతే గతం లో రూ. 83/- ఉండాల్సిన టికెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 120/- కి పెరిగింది. దీనికి నిరసనగా వస్త్ర వ్యాపారులు కూడా తమిళనాట భారీ ఆందోళనలు చేపట్టారు.