ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల షూటింగ్ షురూ..

SMTV Desk 2018-04-13 15:08:52  ntr, trivikram shooting started, pooja hegde.

హైదరాబాద్, ఏప్రిల్ 13 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ‌ నిర్మిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 25 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా సెట్‌లో తీసిన రెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.