ఎక్కడైనా ఆయనే నా అభిమాన హీరో : విరాట్

SMTV Desk 2018-04-13 15:07:46  virat kohli, sachin tendulkar, india cricket team captain, bengalore

బెంగళూరు, ఏప్రిల్ 13: సచిన్ టెండూల్కర్.. తనకంటూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొన్ని పేజిలు సృష్టించుకున్న ఘనుడు. ఈ భారత్ మాజీ క్రికెటర్‌ కు ఢిల్లీ నుండి గల్లీ వరకు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది క్రీడాకారులు ఆయనను క్రికెట్ దేవుడిగా భావిస్తారు. భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ కూడా సచిన్‌కు వీరాభిమానే. తాజాగా ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా చెప్పాడు. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన కోహ్లీకి అభిమానుల నుండి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకరు మైదానం లోపల, వెలుపల మీ అభిమాన హీరో ఎవరు అని అడగ్గా.. ‘ఇంకెవ్వరు సచిన్‌ టెండూల్కర్‌’మరోమారు ఆలోచించకుండా సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. మరొకరు వారాంతంలో ఏం చేస్తుంటారు అని ప్రశ్నించగా.. ‘వారాంతంలో సరదాగా గడిపేందుకు నాకు అవకాశం దొరకదు. ఒకవేళ దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్‌ అయ్యేందుకే ప్రయత్నిస్తా. లేదంటే నా ఫేవరేట్‌ కారులో మ్యూజిక్‌ వింటూ డ్రైవింగ్‌ చేస్తా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.