కేసీఆర్‌ను కలిసిన రామ్‌దేవ్‌ బాబా

SMTV Desk 2018-04-12 18:42:00  Ramdev baba meet cm KCR, at pragathi bhavan, hyderabad

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యోగా గురు రామ్ దేవ్‌ బాబా హైదరాబాద్ లో కలిశారు. ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయనను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పలు అంశాలపై ముచ్చటించారు. భేటీ అనంతరం రామ్‌ దేవ్‌ బాబా తన ట్విట్టర్ ఖాతాలో కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూర దృష్టితో ఉన్నారని, రైతులు, గ్రామీణ ప్రాంతాల సమస్యలపై కేసీఆర్‌కు స్పష్టత ఉందని పేర్కొన్నారు. అలాగే ఆర్థిక రంగంపై కేసీఆర్ ఆలోచనల్లో పూర్తి స్పష్టత ఉందని బాబా ప్రశంసించారు. కాగా, కేసీఆర్‌తో భేటీ అయిన రామ్‌ దేవ్‌ బాబా ఏయే అంశాలపై చర్చించారన్న వివరాలు తెలియాల్సి ఉంది.