కామన్వెల్త్ గేమ్స్ : భారత్ ఖాతాలో మరో స్వర్ణం

SMTV Desk 2018-04-12 18:10:16  common wealth games 2018, sushil kumar, gold coast, common wealth gold medal

గోల్డ్‌కోస్ట్, ఏప్రిల్ 12: ఆస్ట్రేలియాలో జరగుతున్న 21 కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా ఆటగాళ్లు ఆదరగోడుతున్నారు. భారత రెజ్లర్ సుశీల్ కుమార్ వరుసగా మూడో సారి కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం దక్కించుకొన్నాడు. గతంలో సుశీల్ 2010, 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన రెజ్లర్ బోథాను మట్టికరిపించిన సుశీల్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 14కి చేరింది. కామన్వెల్త్‌ గేమ్స్ ఎనిమిదో రోజు భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం నెగ్గింది. అందులో నాలుగు రెజ్లింగ్‌లో రాగా, షూటింగ్‌లో రజతం వచ్చింది. అంతకుముందు రెజ్లర్ రాహుల్ ఆవారే పరుషుల 57 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా భారత్‌ పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 14 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాల కలిపి మొత్తం 29 పతకాలను భారత్ సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.