శ్రీరెడ్డి సమస్యపై చర్చ అవసరం : తమ్మారెడ్డి

SMTV Desk 2018-04-12 18:06:59  tammareddy bharadvaja, tammareddy comments on srireddy,

హైదరాబాద్, ఏప్రిల్ 12 : శ్రీరెడ్డి లేవనెత్తిన సమస్యపై చర్చించడం అవసరం అంటూ ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శ్రీరెడ్డి వ్యవహార౦పై స్పందించిన తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. శ్రీరెడ్డి గొడవ మొదలుపెట్టినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. ఆ అమ్మాయితో ఎవరో ఒకరు పిలిచి మాట్లాడాలని.. నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. శ్రీరెడ్డి ఏంటి.? అనే దానిపై కాకుండా ఆమె లేవనెత్తిన సమస్య గురించి మాట్లాడుకోవడం అవసరం అన్నారు. ఇంతకి శ్రీరెడ్డి ఎదుర్కొంటున్న సమస్య ఉందా.? లేదా.? ఒకవేళ ఉంటే దానిని ఎలా అరికట్టవచ్చు. సమస్యను పరిష్కరించడానికి సంఘాలు ఉన్నాయని, మనకెందుకులే అని కొందరు.. ఇలా ఎవరికి వారే వదిలేస్తున్నాం. దీంతో ఈ సమస్య ఇంకా ఎక్కువైంది. శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిందంటే మనమందరం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి. అయినా నటి శ్రీరెడ్డితో కలిసి పని చేయొద్దని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదని చెప్పుకొచ్చారు.