రాణాకు కానుక ఇచ్చిన విరాట్..

SMTV Desk 2018-04-12 16:52:49  Nitish Rana, Virat kohli, kolkatha knight riders, ipl,

కోల్‌కతా, ఏప్రిల్ 12 : టీమిండియా క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ఎవరినైనా ప్రోత్సహించడంలో వెనకాడడు. తాజాగా విరాట్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న నితీశ్‌ రాణాకు బ్యాట్‌ను కానుకగా అందజేశాడు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్‌ జరిగిన మ్యాచ్ లో మంచి ఊపు మీదున్న ఆర్సీబీ జట్టును రాణా తన బౌలింగ్ తో దెబ్బతీశాడు. ఒక ఓవర్లోనే డివిలయర్స్‌, కోహ్లీని వరుస బంతులకు ఔట్‌ చేసి 11 పరుగులిచ్చాడు. ఆ ప్రదర్శనకు మెచ్చిన కోహ్లి అతనికి బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. కోహ్లి కానుక ఇచ్చిన బ్యాట్‌తో రాణా ఫొటో దిగి ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘మనం ఆడే గేమ్‌లో గొప్ప క్రీడాకారుడు మనల్ని అభినందిస్తే.. మనం మంచి ప్రదర్శన చేసినట్లే. ఈ బ్యాట్‌ ఇచ్చిన కోహ్లీకి ధన్యవాదాలు. భయ్యా ఇలాంటి ప్రోత్సాహమే నీ నుంచి కావాలి’ అని రాణా పేర్కొన్నాడు. 2017లో ముంబయి ఇండియన్స్‌కు ఆడిన రాణాను ఈ ఏడాది వేలంలో కోల్‌కతా దక్కించుకుంది.