త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ ల చిత్రం రేపటి నుండి..!

SMTV Desk 2018-04-12 13:23:35  trivikram, ntr movie, trivikram movie shooting start tomorrow.

హైదరాబాద్, ఏప్రిల్ 12 : మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తారక్‌ ఎన్నడు చూడని గెటప్‌లో కన్పించబోతున్నారని ప్రచారం సాగుతోంది. సిక్స్ ప్యాక్ లో దర్శనమివ్వనున్నాడ౦టూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ ల సినిమా రేపటి నుండి ప్రారంభం కానుందట. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుందని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌ తమన్‌ స్వరాలు అందించనున్నారు.