తెలుగులోనూ "ఒరు అదార్ లవ్"..!

SMTV Desk 2018-04-11 19:12:09  oru adar love, oru adar love in telugu, priya prakash varrior.

హైదరాబాద్, ఏప్రిల్ 11 : "ఒరు అదార్ లవ్".. స్కూల్ రోజుల్లోనే ప్రేమ అనే కొత్త కథనంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ఓ వీడియో వల్ల కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ కు రాత్రికి రాత్రే స్టార్డం వచ్చి పడింది. ఆ వీడియోలో కథానాయిక పలికించిన హావాభావాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. స్టార్ హీరోలు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. ఈ చిత్రాన్ని ఒక్క మలయాళంలోనే కాకుండా హిందీ, తమిళ్, తెలుగులో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రోషన్ హీరోగా నటించాడు. కథానాయికగా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తోంది. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ప్రియా.. ఇన్‌స్టాగ్రాంలో 5.4 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉంది. ఆమె తన ఒక పోస్ట్‌కు రూ.8 లక్షలు వసూలు చేస్తోందట. చాలా పెద్ద స్టార్స్ అయితేనే తమ ఒక్క పోస్టుకు ఇంత పెద్ద మొత్తం వసూలు చేస్తున్నారు. ఒరు ఆదార్ లవ్ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.