ఐపీఎల్ : బోణీ కొట్టేదేవరు..!

SMTV Desk 2018-04-11 17:44:43  rajastan royals vs delhi dare devils, ipl, rahane, gambhir

జైపూర్‌, ఏప్రిల్ 11: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈ రోజు ఢిల్లీ డెర్‌డెవిల్స్‌ (డీడీ) , రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్ఆర్) జట్లు ఈ రోజు జైపూర్ వేదికగా తలపడనున్నాయి. ఇదే వరకు చెరో మ్యాచ్ ఆడిన రెండు జట్లు ఓటమితోనే మొదలపెట్టాయి. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు బాల్ టాంపరింగ్ వివాదంతో స్మిత్ దూరమయ్యాడు. నాయకుడుగా వచ్చిన రహేనే కు తగిన అనుభవం లేకపోవడంతో జట్టును ముందుండి నడిపించలేకపోయాడు. సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన పోరులో అన్ని రంగాల్లో ఆర్ఆర్ విఫలమైంది. దీనికి తోడు ముఖ్య ఆటగాళ్లు కూడా తక్కువ పరుగులకే ఔట్‌ కావడంతో రాజస్థాన్‌ తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. మరోవైపు దిల్లీ డెర్‌డెవిల్స్‌ మొహాలీ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సారథి గౌతం గంభీర్‌ మినహాయించి మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. మరోవైపు బౌలర్లు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఢిల్లీ తొలి మ్యాచ్‌ను పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ డెర్‌డెవిల్స్‌ మధ్య జరగనున్న మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టేదేవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.