అల్జీరియాలో విషాదం..

SMTV Desk 2018-04-11 15:45:35  Algeria, Algeria plane crash, Boufarik airbase, Algiers

అల్జీరియా, ఏప్రిల్ 11 : అల్జీరియా లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ సైనిక విమానం దేశ రాజధాని నగరం అల్జీర్స్‌లోని బౌఫారిక్ విమానాశ్రయానికి కొద్ది దూరంలో కూలిపోయింది. ఈ విమానంలో దాదాపు 100 ఉన్నట్లు సమాచారం. అల్జీర్స్ నుంచి 30 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలగానే పెద్ద ఎత్తున నల్లని పొగలు వెలువడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. స్థానిక టెలివిజన్ ఛానళ్ళలో ప్రసారమవుతున్న దృశ్యాలనుబట్టి ప్రమాద స్థలానికి పెద్ద ఎత్తున సైనికాధికారులు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విమానం తోక ఆలివ్ చెట్లపై వేలాడుతోంది. విమాన శకలాల నుంచి పొగ, జ్వాలలు వస్తున్నాయి. అత్యవసర సేవల సిబ్బంది, భద్రతా సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.