ప్రియురాలి కి వేరొకరితో వివాహం నిశ్చయం అయిందని తెలిసి...

SMTV Desk 2017-07-02 18:43:04  Laughter, A 20-year-old woman, The second floor,Were swept, uthara pradhesh lakno, police

లక్నో, జూలై 2 : రోజు రోజు కి ఆడవారి పై జరిగే అకృత్యాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అందులో లైంగికంగా వేధించే వారి సంఖ్య మరి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. లైంగిక వాంచ తీర్చలేదని ప్రియురాలిని ఇంటి రెండో అంతస్తుపై నుంచి తోసేశాడు ఓ యువకుడు. ఈ ఘటన ముజఫర్ నగర్ సమీపంలోని షామిల్స్ జిల్లా కించనా నగరంలో చోటుచేసుకుంది. బాధితురాలికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయిన విషయం తెలుసుకున్న నిందితుడు దీన్ని వ్యతిరేకించి ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, దీనికి బాధితురాలు సహకరించనందుకు పైనుంచి తోసేశాడని విచారణ లో తేలింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.