యూరప్ లో రామ్..?

SMTV Desk 2018-04-10 17:51:15  Ram Actor, Malavika Sharma, Praveen Sattharu, Bhavya Creations Banner.

హైదరాబాద్, ఏప్రిల్ 10 : ఎనర్జటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలావరకూ మంచు ప్రాంతాల్లో జరగనుందట. దాంతో ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ యూరప్ లో చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ ను.. ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్రవీణ్ సత్తారు డిఫరెంట్ గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలోని మూడు కీలకమైన పాత్రల కోసం తమిళ.. మలయాళ.. హిందీ భాషల నుంచి ముగ్గురు నటులను ఎంపిక చేసుకోనున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటించనుంది. చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ ఈ సినిమాతో హిట్ కొట్టాలనే పట్టుదలతో బాగానే కసరత్తులు చేస్తున్నాడు. మే మొదటివారంలో ఈ సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అయినా రామ్ కి సక్సెస్ ను కట్టబెడుతుందో.. లేదో.. చూడాలి మరి..!