యోగా శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ కవిత

SMTV Desk 2018-04-10 17:16:42  Patanjali, yoga classes, started Nizamabad MP Kavitha

నిజమాబాద్, ఏప్రిల్ 10: గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో పతంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగ శిక్షణ శిభిరాన్ని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రారంభించారు. శిక్షణ శిబిరానికి వచ్చిన వారితో రాందేవ్‌బాబా యోగాసనాలు వేయించారు. యోగా అనేది ఒక్కరోజు చేసే ప్రక్రియ కాదని నిత్య సాధన ఉండాలని రాందేవ్‌బాబా అన్నారు. 2050 నాటికి భారత దేశాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు భారతస్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య కోసం లక్షకోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.