విద్యుత్‌ రైలింజన్‌ ను ప్రారంభించిన మోదీ..

SMTV Desk 2018-04-10 16:27:32  pm modi, PM Launches All-Electric Superfast Train, Make-In-India Leap

ఢిల్లీ, ఏప్రిల్ 10 : భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్‌ రైలింజన్‌ను ప్రారంభించారు. ఈ రైలింజన్‌ 12000 హర్స్‌పవర్ గల‌ సామర్థ్య౦తో మాధేపురాలోని విద్యుత్‌ రైలింజన్ల తయారీ ఫ్యాక్టరీలో రూపొందించారు. దేశంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్‌ రైలింజన్‌ ఇదే కావడం విశేషం. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలగడం ఈ ఇంజిన్‌ ప్రత్యేకత. వీటిని ఎక్కువగా బొగ్గు, ఇనుప ఖనిజాల రవాణాకు ఉపయోగిస్తారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత రైల్వే, ఫ్రాన్స్‌కు చెందిన అల్‌స్టామ్‌ సంస్థ సంయుక్తంగా మాధేపురాలో విద్యుత్‌ రైలింజన్ల తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో ఏడాదికి 110 రైలింజన్లు తయారుచేయవచ్చు. మోదీ నేడు బిహార్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమను మోదీ జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా వీటితో పాటు ముజఫర్‌పూర్‌-సగౌలీ, సగౌలీ-వాల్మికీనగర్‌ డబ్లింగ్‌ పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేశారు.