భరత్ అంత్యక్రియలు ఎవరు చేసారో తెలుసు....: రవితేజ

SMTV Desk 2017-07-02 17:46:25  actor bharath, raviteja, brothar

హైదరాబాద్, జూలై 02 : ఇటీవల రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. భారత్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడంతో నేటీజన్లు రవితేజ కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడంతో మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో నటుడు రవి తేజ తన బాధను ఇలా పంచుకున్నారు. "మా బాధ కొద్ది రోజుల్లో తీరేది కాదు. మనకు బాగా తెలిసిన వ్యక్తి పోతేనే చాలా బాధపడతాం అలాంటిది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సొంత తమ్ముడు పొతే నాకెల ఉంటుంది. భరత్ చనిపోయాడని తెలియగానే నేను మా కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యము." "మా నాన్న వయసు 85 సంవత్సరాలు ఈ వార్త వినగానే అయన కుదేళ్ళపోయారు. మా అమ్మ రాజ్య లక్ష్మి ఉన్న చోటనే కుప్పకూలింది. రఘుని ఆసుపత్రికి పంపించాం. భరత్ ముఖమంతా గాయలై చిద్రమవ్వడంతో చూడలేక పోయాం. అప్పుడు మేము ఎంత బాధలో ఉండి ఉంటామో ఆలోచించర. మా అమ్మ నాన్నలను చుసుకోవడానికి నేను ఇంట్లో ఉండిపోయ రఘును అంత్యక్రియలు చేయమని పంపాము." ఎవరో భయట వ్యక్తులతో అంత్యక్రియలు జరిపించాల్సిన అవసరం మాకేంటి అన్నారు. అసలు ఈ అంత్యక్రియలు చేసింది ఎవరో తెలుసా, మా బాబాయ్. భరత్ ను ఎవరు లేని అనాధల రూ. 1500 ఇచ్చి అంత్యక్రియలు జరిపించారంటే మమ్మల్ని ఎంత ఆవేదనకు గురిచేసిందో తెలుసా ఒక చనిపోయిన వ్యక్తీ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది. మరి ఇంత అమానుషంగా ఉంటారా' అన్నారు.