ముంబై ఇండియన్స్ కు షాక్..

SMTV Desk 2018-04-10 13:32:20  pat cummins, mumbai indians, ipl, australia player pat cummins

ముంబై, ఏప్రిల్ 10 : డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు పెద్ద షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు ఆటగాడు కమిన్స్‌ మొత్తం ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిటెస్టులో కమిన్స్‌ వెన్నునొప్పితో తీవ్రంగా భాదపడ్డాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా అతని వెన్నుపూసలో ఎముకకు గాయమైనట్లు తేలిందని ఆస్ట్రేలియా జట్టు ఫిజియో​ డేవిడ్‌ బేక్లీ తెలిపాడు. ఈ సీజన్‌ వేలంలో ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని ముంబై 5.4 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ముంబయి ఇండియన్స్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో ముంబై, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఈ నెల 15న తలపడనుంది.