గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్ డీఎఫ్ సీ

SMTV Desk 2018-04-10 12:39:54  bombay, Hdfc, housing loan, intrest,

ముంబై, ఏప్రిల్ 10: గృహ రుణాలపై వడ్డీ రేట్లను హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్ డీఎఫ్ సీ పెంచింది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ (పీఎల్ఆర్) రేటును 2013 డిసెంబర్ తర్వాత పెంచడం ఇదే తొలిసారి. రూ.30 లక్షలకు పైన ఉన్న రుణాలపై 0.20 శాతం పెంచగా, ఆ లోపు ఉన్న రుణాలపై కేవలం 0.05 శాతమే పెంచడం గమనార్హం. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా రూ.30 లక్షల్లోపే రుణాలు తీసుకుంటాయి. వాటిపై భారం లేకుండా చూసింది. తాజా పెంపుతో రూ.30 లక్షల్లోపు గృహ రుణాలపై వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 8.45 శాతానికి, రూ.30-75లక్షల మధ్య రుణాలపై వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 8.60 శాతానికి రూ.75 లక్షలకు పైన రుణాలపై 8.50 శాతం నుంచి 8.70 శాతానికి వడ్డీ రేటు పెరిగింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పదేళ్ల బాండ్లపై రాబడులు పెరిగిపోతుండంతో పలు బ్యాంకులు రుణాలు, డిపాజిట్లపై రేట్లను పెంచుతూ ఇప్పటికే ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నాయి.