చెపాక్‌లో చెక్ చెప్పేదేవరు..!

SMTV Desk 2018-04-10 11:21:26  chennai super kings, kolkatha knight riders, ipl, chepak stadium

చెన్నై, ఏప్రిల్ 10 : చెన్నై సూపర్ కింగ్స్ ..ఐపీఎల్ లో ఈ జట్టుకున్న ఆదరణే వేరు. మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని ఈ జట్టుకు భారీగా అభిమానగణం ఉంది. కాగా ఈ రోజు ధోని సైన్యం సొంతగడ్డపై చెన్నైలోని చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ప్రారంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై ఓడిపోవాల్సిన మ్యాచ్ ను బ్రావో సునామీ ఇన్నింగ్స్‌తో జట్టు అనూహ్య విజయాన్నిఅందుకొంది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న చెన్నై జట్టుకు సొంతగడ్డపై ఆడటం కలిసొచ్చేఅంశం. మరోవైపు దినేష్ కార్తీక్ నేతృత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లో చక్కటి విజయాన్నందుకున్న నైట్‌రైడర్స్‌ చెన్నైని ఎ మేర అడ్డుకుంటుందో చూడాలి..! ఇరు జట్లు చెరో విజయంతో ఉండగా మరి చెపాక్ స్టేడియంలో చెక్ చెప్పేదేవరో కొన్ని గంటల్లో తేలనుంది.