బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడు

SMTV Desk 2017-07-02 16:14:54  rape, boy, 19years, girl

హయత్ నగర్, జూలై 02 : బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హయత్ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.... అబ్దుల్లాపూర్ లో నివాసం ఉంటున్న యువకుడి పేరు అమీర్ కుస్రు(19) ఇతను ఓ ప్రైవేట్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. గత నెలలో 29 న బాలిక (16) అతను ఉంటున్న వీధి నుంచి మధ్యాహ్నం సమయంలో నడుచుకుంటూ వెళ్తుంటే అమీర్ కుస్రు బాలిక ను ఇంట్లో కి బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. శనివారం బాలుడు సికింద్రాబాద్ రైల్లో తన ఉరికి వెళ్లేందుకు ఇనామ్ గూడలో బస్సు కోసం చూస్తుంటే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.