టీ-20 ర్యాంకింగ్స్ : తొలి ఐదు స్థానాలు లెగ్ స్పిన్నర్లే

SMTV Desk 2018-04-09 18:38:07  icc, t-20 rankings, rashid khan, yuzvendra chahal

దుబాయ్‌, ఏప్రిల్ 9 : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ-20 ర్యాంకింగ్స్ లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్ లో తొలి ఐదు స్థానాలను లెగ్ స్పిన్నర్లే కైవసం చేసుకున్నారు. అఫ్గాన్‌ యువ క్రీడాకారుడు రషీద్ ఖాన్ 759 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. పాక్ లెగ్ స్పిన్నర్ షాదాబ్‌ఖాన్‌ 733 పాయింట్లతో రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. 706 పాయింట్లతో భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ మూడో ర్యాంకు సాధించగా, న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఇష్‌ సోది(700), వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సామ్యుల్‌ బద్రీ (671) నాలుగు, ఐదో ర్యాంకుల్లో ఉన్నారు.