కానిస్టేబుళ్ల పై డిప్యూటీ సీఎం సంతోషం

SMTV Desk 2017-07-02 15:48:49   Deputy Chief Minister Hon, ramjan, Religious harmony, Appreciated, Constables are Venkatesh and Pratap Singh,Muslim, janaareddy, Mohammad Shabir Ali

హైదరాబాద్, జూలై 2 : కానిస్టేబుళ్లకు డిప్యూటీ ముఖ్యమంత్రి సన్మానం... రంజాన్ సందర్భంగా మత సామరస్యం పరిడవిల్లేలా వ్యవహరించి, ప్రశంసలు అందుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ శనివారం తన నివాసంలో సన్మానించారు. ఆ రోజు మీరాలం ఈద్గాలో నమాజు చదివే సమయంలో ఉపయోగించే జానీమాజ్ లు ఒకేసారిగా గాలికి ఎగిరిపోగా కాలాపత్తర్ పొలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వెంకటేశ్, ప్రతాప్ సింగ్ వాటిని సవరించి ముస్లింలకు ఇబ్బంది కలుగకుండా సహకరించారు. దీనిని గమనించిన ఆ డిప్యూటీ సీఎం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను తన నివాసానికి ఆహ్వానించి సన్మానించారు. వీరి తరపున నేతలు జానారెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ సన్మానించారు. వీరితో పాటు టీఆర్ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన ఖాజామోహినొద్దిన్ ను డిప్యూటీ సీఎం తన నివాసంలో సన్మానించారు. ఈ మేరకు తమ పోలీస్ డ్యూటీని బాధ్యతగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం సంతోషం వ్యక్తపరిచారు.