"అర్జున్ రెడ్డి"ని మర్చిపోలేకపోయా.. : అల్లు అర్జున్

SMTV Desk 2018-04-08 17:18:21  allu arjun, arjun reddy, allu arjun comments on arjun reddy movie.

హైదరాబాద్, ఏప్రిల్ 8 : "అర్జున్ రెడ్డి" సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనం. ఎన్నో వివాదాలను దాటుకొని విడుదలైనా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రేక్షకాభిమానుల నుండే కాకుండా దాదాపు సినీ ప్రముఖుల వరకు అందరు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. అంతలా యూత్ ను అలరించింది. తాజాగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమా గురించి తెలిపారు. నేను ఏదైనా సినిమా చూస్తే దానితో ప్రభావితం అవుతుంటాను. అంతలా నన్ను ఆకట్టుకున్న సినిమా అంటే "అర్జున్ రెడ్డి". చాలా రోజుల వరకు నేను ఆ సినిమా నుండి బయటకు రాలేకపోయాను. ఈ సినిమా పేరు చెప్పగానే చాలామందికి డ్రగ్స్.. సెక్స్.. ఇవే గుర్తుకొస్తాయి. కాని నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ చిత్రంలో నటీ నటుల ప్రతిభ.. దర్శకుడు కథను నడిపించిన విధానం.. డైలాగులు చెప్పిన పద్ధతి.. ఇవన్నీ చాలా నచ్చాయి" అంటూ తన మనసులో మాటను వెల్లడించారు.