భావోద్వేగంతో రేణూదేశాయ్ ఫేస్ బుక్ పోస్ట్..

SMTV Desk 2018-04-08 15:52:13  akira birthday, renu desai, facebook post.

హైదరాబాద్, ఏప్రిల్ 8 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రేణూదేశాయ్ ల తనయుడు అకీరా పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియాలో అకీరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అకీరా కు వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కూడా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా రేణూ భావోద్వేగంతో ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. "నా బాబుపై మీరంతా చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. అకీరా 14 సంవత్సరాల్లోకి అడుగుపెట్టాడు. ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్న కుటుంబంలో జన్మించిన అకీరా.. తన కుటుంబసభ్యులులాగా ఏ రంగాన్ని ఎంచుకున్నా విజయవంతంగా రాణించాలని, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని తల్లిగా కోరుకుంటున్నా. నా చిట్టి బర్త్‌డే బాయ్‌ నుంచి మీకు కృతజ్ఞతలు" అంటూ అకీరాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.