ఎనిమిదేళ్ళ వయసులో వివాహం.....నీట్ పరీక్ష లో విజయం

SMTV Desk 2017-07-02 14:03:08  neet results, rajasthan, roopa, rank, 10th class, inter, top ranker

రాజస్థాన్, జూలై 2 : సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించొచ్చు అంటారు మన పెద్దలు. ఆ మాట మరోసారి నిజం చేసింది రూపా. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించింది ఈ అమ్మాయి.... చిన్న వయసులోనే వివాహం అయినప్పటికీ ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క నీట్ పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించింది. జైపూర్ లోని కరేరీ గ్రామంలో ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన రూపా యాదవ్(21) కి ఎనిమిదేళ్ళ వయసులో నే వివాహం అయ్యింది. తరువాత చదువు మీద రూపాకి ఉన్న ఆసక్తి గ్రహించిన ఆమె భర్త మరియు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహం కూడా రూపాకి తోడైంది. దీంతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించింది రూపా. గతేడాది నీట్ పరీక్షకు హాజరయ్యినప్పటికీ పరీక్షలో మాత్రం ఉత్తీర్ణత సాధించలేకపోయింది రూపా. అదే కసితో మరింత ఎక్కువగా కష్టపడి ఈ ఏడాది నీట్ పరీక్షలో 2,612 ర్యాంకు సాధించి తన సత్తా చాటింది ఈ వివాహిత. ఈ మేరకు రూపా మాట్లాడుతూ ఇంత దూరం రావడానికి తన భర్త ఇచ్చిన ధైర్యం, ప్రోత్సహంతోనే ఈ విజయం సాధించగలిగానని తెలిపారు. ఇదంతా తన అత్తింటి ప్రోత్సాహంతోనే సాధ్యపడిందని రూపా వ్యక్త పరిచింది.