సల్మాన్‌ఖాన్‌కు ఘనస్వాగతం

SMTV Desk 2018-04-08 12:25:59  tollywood hero salman khan,sanctioned bail, hero welcome

ముంబయి, ఏప్రిల్ 8 : కృష్ణజింకల వేట కేసులో ఐదేళ్లు జైలు శిక్ష పడి బెయిల్‌ పొందిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు ముంబయిలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నటుడికి బెయిల్‌ రావడంతో బాణాసంచా కాల్చి, ఆనందంలో మునిగిపోయారు. మిఠాయిలు పంచుకున్నారు. ఇంటి బయట వేచి ఉన్న అభిమానులను చూసి సల్మాన్‌ఖాన్‌ వారికి అభివాదం చేశారు. జైలు జీవితం గడిపి ఇంటికి చేరిన సల్మాన్‌ను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు పరామర్శించారు. 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు జోథ్‌పూర్‌ కోర్టు గురువారం ఐదేళ్లు జైలు శిక్ష విధించగా.. ఆయనను అక్కడి కారాగారానికి తరలించారు. రెండు రోజుల జైలు జీవితం అనంతరం శనివారం న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.