కెనడాలో దారుణం.. 13 మంది క్రీడాకారుల మృతి

SMTV Desk 2018-04-07 16:56:29  CANADA CRASH, ICE HOCKEY TEAM PLAYERS, CANADA, JUSTIN TRUDEAU

ఒట్టావా, ఏప్రిల్ 7 : కెనడాలో దారుణం చోటుచేసుకుంది. ఐస్ హాకీ జట్టుకు చెందిన 13 మంది ఆటగాళ్లు, ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కెనడా క్రీడా ప్రపంచంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆవరించాయి. కెనడాలోని సస్‌కచివాన్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని కెనడా అధికారులు శనివారం వెల్లడించారు. రాయల్ కెనడా మౌంటెడ్ పోలీసుల సమాచారం ప్రకారం.. హంబోల్డ్ బ్రాంకోస్ జట్టుకు చెందిన జూనియర్ ఐస్ హాకీ ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం కలిపి 28 మంది ఓ బస్సులో వెళ్తున్నారు. సస్‌కచివాన్‌లోని టిస్డేల్‌లో హైవేపై వెళ్తుండగా వీరు వెళ్తున్న బస్సు, ఓ ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 13 మంది ఆటగాళ్లు, డ్రైవర్ మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఐస్ హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.