అన్నట్టుగానే శ్రీరెడ్డి.. అర్ధనగ్న నిరసన

SMTV Desk 2018-04-07 14:16:40  actress srireddy, protest at film chamber.

హైదరాబాద్, ఏప్రిల్ 7 : నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. కొంతకాలంగా తనకు టాలీవుడ్ లోని ప్రముఖులు అన్యాయం చేశారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. వినూత్న౦గా నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయకపోతే ఫిల్మ్ ఛాంబర్ వద్ద బట్టలు విప్పి నిరసన తెలియజేస్తానని ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో ప్రకటించిన శ్రీరెడ్డి.. అన్నట్టుగానే అర్థనగ్న ప్రదర్శన చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద వస్త్రాలను పూర్తిగా తొలగించి నిరసన తెలిపింది. వెంటనే అప్రమత్తమైన ఛాంబర్ సభ్యులు ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో పోలీసులు రంగప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు శ్రీరెడ్డి ని అదుపులోకి తీసుకొని చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగాను ఆమెను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.