కామన్ వెల్త్‌ గేమ్స్ : స్వర్ణం సాధించిన సతీష్‌

SMTV Desk 2018-04-07 12:15:41  common wealth games-2018, Sathish Kumar , weight lifiting gold medal, australia

గోల్డ్‌కోస్ట్‌, ఏప్రిల్ 7: అస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో జరుగుతున్నా21వ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో స్వర్ణం సాధించింది. శనివారం ఉదయం జరిగిన 77 కేజీల విభాగం పోటీల్లో సతీశ్‌ కుమార్‌ శివలింగం ఈ ఘనత సాధించారు. మొత్తం 317 కేజీల బరువునెత్తి అద్భుత ప్రదర్శన కనబరిచిన సతీష్‌ పసిడి పతకాన్ని పొందారు. ఈసారి క్రీడల్లో ఇప్పటిదాకా భారత్‌కు ఐదు పతకాలు రాగా.. అన్నీ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలోనే సాధించటం విశేషం. ఈ పోటీల్లో వెయిట్‌ లిఫ్టర్లు దీపక్‌ లాటెర్‌ ( కాంస్యం), గురు రాజా(రజతం), మీరాబాయి చాను(స్వర్ణం), సంజిత చాను (స్వర్ణం) పతకాలు గెలుచుకున్నారు.