ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశారు: రోజా

SMTV Desk 2018-04-06 13:26:10   Special Category Status, roja YSRCP

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఏదో సాధిస్తానని ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నిలువునా మోసిగించిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారని చెప్పారు. పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చినా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయారా? అని నిలదీశారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు.