వైకాపా ఎంపీలు రాజీనామా

SMTV Desk 2018-04-06 12:55:48  Special status, ysr congress MPs, resignations

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని స్పీకర్ సూచించారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు బయల్దేరారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణదీక్షను వారు చేపట్టనున్నారు.