ఆయుష్ ద్వారా వేప పుల్లలు

SMTV Desk 2017-05-29 12:01:51  vepa pullalu,Ayush,to market,

న్యూఢిల్లీ, మే 28 : ఆరోగ్యంతో పాటు దంతాల ధృడత్వానికి ఊతం ఇచ్చే వేప పుల్లల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ వినూత్న రీతిలో స్పందించింది. వేపపుల్లల మార్కెటింగ్ ను నిర్వహించాలని తలపెట్టింది. అది కూడా ఆ వేప పుల్లల్ని వివిధ బ్రాండ్ లుగా మార్కెట్లోకి తీసుకురానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వేపచెట్లనుండి వాటిని సేకరించి పట్టణ ప్రాంత దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయ్ స్పష్టం చేశారు. ప్రథమంగా మహారాష్ట్రలోని ముంబాయిలో వీటి అమ్మకాలను ప్రారంభిస్తామని, తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.