సల్మాన్‌ జైలు శిక్షపై షోయబ్‌ అక్తర్‌ విచారం

SMTV Desk 2018-04-06 12:31:12   Salman Khan, shoab akthar cricketer, Deer hunting case, Twitter

ఇస్లామాబాద్‌, ఏప్రిల్ 6: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ జైలు శిక్షపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ షోయబ్‌ అక్తర్‌ ట్విటర్‌లో స్పందించాడు. సల్మాన్‌ కు కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయనకు ఐదేళ్ల శిక్ష విధించడం చాలా కఠినమని పేర్కొన్నారు. తన స్నేహితుడు సల్మాన్‌ ఖాన్‌కు ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడటం చాలా బాధకరమని ట్విటర్‌ ద్వారా తెలిపాడు. కానీ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని వెల్లడించారు. సల్మాన్‌ కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సల్మాన్‌ తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు.