కామన్‌వెల్త్ లో భారత్ కు తొలి స్వర్ణం..

SMTV Desk 2018-04-05 13:20:18  mirabai chanu, Commonwealth Games 2018, goldcoast, gold medal

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 5 : అస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో జరుగుతున్నా21వ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయ్ ఛాను 48 కేజీల విభాగంలోభారత్ కు పసిడి పతకాన్ని అందించింది. స‍్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌ చాలెంజ్‌లో మీరాబాయ్‌ చానుకు ఎదురే లేకుండా పోయింది. స్నాచ్‌లో భాగంగా జరిగిన మూడు రౌండ్‌లలో (80,84 86 కేజీలు) చాను సక్సెస్‌ఫుల్‌గా బరువులు ఎత్తగా, క్లీన్‌ అండ్‌ జర్క్‌ విభాగంలోని మూడు రౌండ్లను(103, 107, 110 కేజీలు) మీరాబాయ్‌ చాను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. చాను స్వర్ణం కైవసం చేసుకోగా.. మారిషస్‌కు చెందిన హనిత్రా(170కేజీలు) రజతం గెలుచుకోగా, శ్రీలంకకు చెందిన దినూష(155) కాంస్యను దక్కించుకొన్నారు. ఈ కామన్వెల్త్ పోటీల్లో ఇప్పటి వరకు భారత్‌ సాధించిన రెండు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే కావడం విశేషం. పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా రజతం సొంతం చేసుకుని మొదటి పతాకాన్ని ఇండియా కు అందించాడు.