మాడ్రిడ్, ఏప్రిల్ 4 : క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్ బాల్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. మైదానంలో పాదరసంల కదులుతూ ప్రత్యర్ధులను ముప్పతిప్పలుపెట్టే ఈ పోర్చుగల్ వీరుడు చేసిన ఒక గోల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతని గోల్ చేసిన విధానంకు ప్రత్యర్ధి జట్టు అభిమానులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. రియాల్ మాడ్రిడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో జువెంటస్ తో జరిగిన మ్యాచ్‌లో గాల్లోకి పక్షిలా ఎగురుతూ చేసిన గోల్ ను సైకిల్ కిక్ గోల్ అని ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో జువెంటస్‌పై 3-0తో నెగ్గిన రియల్ మాడ్రిడ్ జట్టు ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. రొనాల్డో చేసిన గోల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతుంది. ముఖ్యంగా మ్యాచ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లెబ్రాన్ జేమ్స్ రొనాల్డోపై ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ ఏ గ్రహం నుంచి వచ్చాడు. అతడు గ్రహాంతరవాసి. లేకపోతే అతడికి ఈ విన్యాసాలు ఎలా సాధ్యం" అని అభిప్రాయపడ్డారు.