పాపం ప్రియావారియర్‌..!

SMTV Desk 2018-04-04 12:42:41  priya prakash varrier, bollywood, koliwood, movie chances.

కేరళ, మార్చి 4 : ప్రియావారియర్‌.. ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్న తార. సోషల్ మీడియాలో అందరిని పక్కకు నెట్టి అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది. కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది. అంత పాపులారిటీ తెచ్చుకున్న ప్రియా కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస ఆఫర్లను దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాని దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు చేజారి వేరే హీరోయిన్లను వరించినట్లు తెలుస్తోంది. ప్రియా టాలెంట్ ఏంటో తెలిసినా.. ఇంకా ఆమెను చిన్న పిల్లలానే చూస్తున్నారు. దీంతో తనను స్టార్ హీరోల పక్కన టీనేజ్ అమ్మాయిలు అంతగా నప్పరు అన్న ఉద్దేశంతోనే.. ప్రియావారియర్‌ని కాకుండా వేరేవారిని తీసుకున్నట్లు సమాచారం. పాపం ఎంత స్టార్ డమ్ ఉన్నా.. స్టార్ హీరోల పక్కన నటించే రెండు అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.