హ్యాట్సాఫ్ సుకుమార్‌ : వెంకటేష్

SMTV Desk 2018-04-04 11:04:44  victory venkatesh, rangasthalam review, venkatesh facebook

హైదరాబాద్, ఏప్రిల్ 4 : దర్శకుడు సుకుమార్ మాయ "రంగస్థలం". ఒక్కసారిగా జనాలను 1985 లోకి తీసుకెళ్ళారు. రామ్ చరణ్, సమ౦త జంటగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్బులో చేరిన ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ చూపించిన అసమాన నటనను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు ఎవరి నోటా విన్నా "రంగస్థలం" సినిమా గురించే అనేంతలా ఆకట్టుకుంది. ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన విక్టరీ వెంకటేష్ తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. "రంగస్థలం సినిమా చూశా. చిట్టిబాబుగా రామ్ చరణ్ ఈ సినిమాలో జీవించాడు. ఒక్కొక్క పాత్రని ఎంతో చక్కగా తీర్చిదిద్దిన సుకుమార్‌కి హ్యాట్సాఫ్. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు" అంటూ పోస్ట్ చేశారు.