ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షా 104వ జయంతి

SMTV Desk 2018-04-03 15:31:11  Sam Manekshaw, Indias First Field Marshal, indian army marshal, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : ఇండియన్ ఆర్మీ.. అంటే ధైర్యానికి, శక్తికి, క్రమశిక్షణకు తెగువకు నిదర్శనం.. మన సైనికులు ఎన్నో బంధాలను త్యజించి దేశ రక్షణ కోసం సరిహద్దులో భయం లేకుండా పహారా కాస్తున్నారు. ఎంతో మంది కమాండర్లు శత్రువుల తూటాలకు ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అలాంటి భారత ఆర్మీ కమాండర్లలోని గొప్పవారిలో ఒకరు ఫీల్డ్‌ మార్షల్‌ శామ్‌ మానెక్‌షా. ఈ రోజు ఆయన 104వ జయంతి (ఏప్రిల్‌ 3). శామ్‌ మానెక్‌షా పూర్తి పేరు శామ్‌ హర్మోస్‌జీ ప్రేమ్‌జీ జంషెడ్జీ మానెక్‌షా. మానెక్‌షా ఏప్రిల్‌ 3, 1914న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. ఈయన 40 ఏళ్లు ఆర్మీలో సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధం, ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం(1947), చైనా-ఇండియా యుద్ధం(1962), ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం(1966), బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం(1971)ఈ ఐదు యుద్ధాల్లో పాల్గొన్న ఏకైక ఫీల్డ్‌ మార్షల్‌. మానెక్‌షా ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. బర్మాలో యువ కెప్టెన్‌గా జపాన్‌తో యుద్ధం చేయడానికి వెళ్లినపుడు తీవ్రంగా గాయపడ్డాడు. 9 బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్లాయి. సిపాయి శేర్‌ సింగ్‌ ఆయనను కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆర్మీలో నుంచి రిటైర్‌ అవుదామన్న సమయంలో ఇష్టం లేకపోయినా 1972లో అప్పటి రాష్ట్రపతి ఆయన పదవీకాలాన్నీ 6 నెలలు పొడిగించడంతో మరో ఆరు నెలలు సేవలు అందించారు. ఆయన అందించిన సేవలకు గానూ 1942 మిలిటరీ క్రాస్‌ అవార్డు, 1968లో పద్మ భూషణ్‌ అవార్డు, 1972లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు. న్యూజిలాండ్‌ రాజధాని వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో న్యూమోనియాతో 2008, జూన్‌ 27న మానెక్‌షా కన్నుమూశారు. అంతటి మహావీరుడు మరణించిన ఒక్క రాజకీయ నాయకుడు హాజరుకాలేదు. కనీసం ఆయన దివంగతుడైన రోజును జాతీయ సంతాప దినంగా కూడా వెల్లడించలేదు