పవర్ ఫుల్ లుక్స్ తో అదరగొడుతున్న బన్ని..

SMTV Desk 2018-04-03 13:28:56  na peru surya, new poster release, allu arjun.

హైదరాబాద్, ఏప్రిల్ 3 : వక్కతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న "నా పేరు సూర్య" చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 8 వ తేదీన బన్ని పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించి మరో పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ ను బన్ని ఫేస్ పై భారతదేశంలోని వివిధ ప్రాంతాల పేర్లు వచ్చేలా రూపొందించారు. ఆర్మీ ఆఫీసర్ గా ఆయన ఇచ్చిన స్టిల్.. పవర్ ఫుల్ లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మే 4వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.