పేద యువతులకు మమత చేయూత

SMTV Desk 2018-04-01 16:54:04  mamatha benerjee,women marriage, economical support

కోల్‌కతా, ఏప్రిల్ 1: పేద యువతుల వివాహనికి చేయూతనిచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలికలు చదువుకునేలా, బాల్య వివాహల నిర్మూలనే లక్ష్యంగా బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే కన్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలికలకు సంవత్సరానికి 500 రూపాయల స్కాలర్‌షిప్‌తోపాటు, టెన్త్ పాసయ్యాక ఒకేసారి 25వేల రూపాయలు అందజేస్తున్నారు. ఈ పథకానికి కొనసాగింపుగా రూపశ్రీ పథకాన్ని గత బుధవారం నుంచి అమల్లోకి తీసుకుచ్చారు. ఇందులో భాగంగా పేద మహిళల వివాహానికి 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారని, ఆర్థికంగా వెనుకబడిన ఆరు లక్షల యువతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.