డోక్లాం వివాదంతో సరిహద్దుల్లో భారిగా దళాలు

SMTV Desk 2018-04-01 16:12:59  china, Doklam controversy, Arunachal Pradesh border, chaina hikeLogo Bar

కిబిథు, ఏప్రిల్ 1: చైనాతో ఏర్పడిన డోక్లాం వివాదం అనంతరం అరుణాచల్‌ ప్రదేశ్‌–టిబెట్‌ సరిహద్దుల్లో భారత్‌ అధిక సంఖ్యలో బలగాలను మోహరించింది. దిబాంగ్, డౌ–డెలాయ్‌ పర్వత ప్రాంతాలు, లోహిత్‌ లోయలో గస్తీని పెంచింది. సరిహద్దులో చైనా కార్యకలాపాలపై నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు మిలిటరీ అధికారులు చెప్పారు. టిబెట్‌ సరిహద్దుల్లో రెక్కీ నిర్వహించేందుకు హెలికాప్టర్లను ఆర్మీ వాడుతోంది. ‘డోక్లాం వివాదం తర్వాత చైనా సరిహద్దులో మా కార్యకలాపాలు అనేక రెట్లు పెరిగాయి. ఏ సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని కిబిథు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆర్మీ అధికారి చెప్పారు. సైనికులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం 15 నుంచి 30 రోజులపాటు వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.