ఇస్రోతో జీశాట్-6ఏ కనెక్షన్ కట్

SMTV Desk 2018-04-01 14:43:40  ISRO, GSAT-6A Satellite,gslvshaar

హైదరాబాద్, ఏప్రిల్ 1‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం ప్రయోగించిన జీశాట్-6ఏ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని జీశాట్‌-6ఏను ప్రయోగించిన 48 గంటల తర్వాత ఇస్రో తెలిపింది. ఈ ఉపగ్రహానికి సంబందించి చివరిదైన మూడో లామ్‌ ఇంజిన్‌ను మండించిన సమయం నుంచి దానితో అనుసంధానం కోల్పోయామని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. చివరిసారిగా దాని నుంచి మార్చి 30న ఉదయం 9.22 నిమిషాలకు సమాచారం అందిందని ఇస్రో వెల్లడించింది. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో అది సమాచారాన్ని చేరవేసిందని పేర్కొంది. ఆ తర్వాత రెండోసారి కక్ష్య పెంపును మార్చి 31న చేపట్టినట్లు తెలిపింది. ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో అధికారులు వివరించారు.