ధావన్ బౌలింగ్... అయేషా బ్యాటింగ్‌

SMTV Desk 2018-03-31 17:56:56  shikhar dhawan, dhawan bowling, shikhar dhawan wife, sydney

సిడ్నీ, మార్చి 31 : టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ బౌలింగ్ చేశాడు.. అదేంటి ధావన్ బ్యాటింగ్ చేస్తాడుగా అని ఆశ్చర్యపోతున్నారా..! అతని బౌలింగ్ వేసింది ఎవరికోసమో కాదు.. తన భార్య అయేషా కోసం.. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియాలో గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలితో కలిసి తను ఓ బీచ్‌లో సరదాగా అందరూ కలిసి కాసేపు క్రికెట్‌ ఆడారు. ఎప్పుడూ బ్యాటింగ్‌ చేసే గబ్బర్‌ తన భార్య కోసం బౌలర్‌గా మారి ఆమెకు బంతులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ధావన్‌ తన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘మైదానంలో బ్యాట్స్‌మెన్‌ను.. మైదానం వెలుపల బౌలర్‌ను. భార్య బ్యాటింగ్‌ చేస్తానని ప్రేమగా అడిగినప్పుడు భర్తగా నేను ఇంకేమి చేయగలను. నా కుటుంబంతో గడిపిన ఈ క్షణాలు ఎంతో నచ్చాయి’ అని వెల్లడించాడు.