సీఎం అధికారిక అప్లికేషన్‌ అదృశ్యం

SMTV Desk 2018-03-31 16:18:06   Karnataka CM Siddaramaiah, mobile app, Google Play Store

బెంగళూరు, మార్చి 31: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక అప్లికేషన్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అదృశ్యమైంది. ఈ యాప్‌ యూజర్లు వ్యక్తిగత డేటాను ఓ ప్రైవేట్‌ కంపెనీకి విక్రయిస్తుందనే ట్విటర్‌ యూజర్ల ఆరోపణల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్లే స్టోర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధికారిక యాప్‌ కూడా కనిపించడం లేదు. వీటి లింక్‌లను క్లిక్‌ చేస్తే.. ‘ ప్రస్తుతం ఆ కంటెంట్‌ మీ దేశంలో అందుబాటులో లేదని, వీలైనంత త్వరగా మీరు ఇష్టపడే కంటెంట్‌ మరిన్ని దేశాలకు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. దయచేసి మళ్ళీ చెక్‌ చేయ్యండి’ అని చూపిస్తోంది. మరికొన్ని రోజుల్లో కర్నాటక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం యాప్‌ అదృశ్య కావడం చర్చనీయాంశమైంది.