ఐపీఎల్ కు నో చెప్పిన లంక క్రికెటర్..

SMTV Desk 2018-03-31 14:05:38  sun risers hyderabad, ipl-11, kushal perera, srilanka

హైదరాబాద్, మార్చి 31 ‌:ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ టోర్నీకు గల ఆదరణ మరే లీగ్ కు లేదంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాధాన్యం గల ఈ మెగా టోర్నీలో అవకాశం కోసం ఎన్నో దేశాల ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ సత్తా చాటితే పేరు, ప్రఖ్యాతలతో పాటు కనక వర్షం కురుస్తుంది. కానీ ఐపీఎల్ లో ఆడే అవకాశాన్ని శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా వదులుకున్నాడు. ప్రస్తుతం బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా సన్ రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ వైదొలిగినా విషయం తెలిసిందే. అతని స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరా ను తీసుకోవాలని సన్ రైజర్స్ యాజమాన్యం భావించింది. దీనిలో భాగంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పెరీరాను సంప్రదించగా ఐపీఎల్‌లో ఆడేందుకు తాను సిద్ధంగాలేనని తిరస్కరించినట్లు సమాచారం. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నమెంట్లో రాణించి తిరిగి లంక టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని కుశాల్ అనుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు నిషేధాన్ని ఎదుర్కొన్న స్టీవ్‌స్మిత్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బీసీసీఐకి లేఖ పంపింది.