బిగ్‌బీ కి మెగాస్టార్ రాచమర్యాదలు..!

SMTV Desk 2018-03-31 11:43:18  AMITABH BACHCHAN, CHIRANJEEVI, SAIRA NARASIMHA REDDY, ROLS RAIS CAR.

హైదరాబాద్, మార్చి 31 : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. మెగాస్టార్ చిరంజీవిల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగానే బిగ్ బి చిరుతో "సైరా నరసింహారెడ్డి" సినిమా అంగీకరించారన్న విషయం తెలిసిందే. అయితే అమితాబ్ ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిరు అమితాబ్ కి రాచమర్యాదలు చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బీ హోటల్ నుంచి షూటింగ్ లొకేషన్‌కు రావడానికి చిరు తన రోల్స్ రాయిస్ కారును పంపించినట్టు సమాచారం. ఆ కారు రెండు రోజుల పాటు అమితాబ్‌తోనే ఉందట. అంతేకాదు, అమితాబ్ కు కట్టుదిట్టమైన సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. షూటింగ్ లో అమితాబ్ కు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారట చిరు. ఇదిలా ఉండగా చిరంజీవితో కలిసి పనిచేయడం గౌరవంగా, ఆనందంగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.